Coronavirus in India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదు, ప్రస్తుతం దేశంలో 84,931 యాక్టివ్‌ కేసులు

నిన్న 9వేలకుపైగా కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 9,206 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు 45 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Coronavirus Outbreak in China (Photo Credits: PTI)

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న 9వేలకుపైగా కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 9,206 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు 45 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,44,15,723కు పెరిగింది. ఇందులో 4,38,02,993 మంది కోలుకున్నారు. మొత్తం 5,27,799 మంది కరోనా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 84,931 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.58శాతం ఉందని, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 211.91 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు