CM Kejriwal Breaks Down in Tears Video: వీడియో ఇదిగో, సిసోడియాను తలుచుకుంటూ ఏడ్చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జైలులో పెట్టారంటూ కన్నీటి పర్యంతం

ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌..మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. నగరంలో ఓ స్కూల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేజ్రీవాల్‌ సిసోడియాను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Arvind Kejriwal Breaks Down Video (Photo Credit: Twitter/ @ANI)

ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌..మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. నగరంలో ఓ స్కూల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేజ్రీవాల్‌ సిసోడియాను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. మనీశ్‌ సిసోడియా గారు ఇది మొదలుపెట్టారు. ఇవాళ ఆయన్ని ఎంతో మిస్‌ అవుతున్నా. విద్యా శాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారు. ప్రతీ చిన్నారికి మెరుగైన విద్య అందించాలన్నది ఆయన కల. అందు కోసం విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, పాఠశాలలు మెరుగైన వసతులతో నిర్మించడం లాంటి ప్రయత్నాలు చేశారు. బహుశా అందుకేనేమో ఆయన్ని ఇవాళ జైలులో పెట్టారంటూ సీఎం కేజ్రీవాల్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ANI Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement