Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, యూపీలో ఫేక్ అంత్యక్రియలకు యత్నించిన ముగ్గురు అరెస్ట్, బీమా డబ్బుల కోసం ఫేక్ అంత్యక్రియలు నిర్వహించాలనుకున్న ఢిల్లీ వస్త్ర వ్యాపారి, మరో ఇద్దరు వ్యక్తులు
బీమా డబ్బుల కోసం ఫేక్ అంత్యక్రియలు నిర్వహించాలనుకున్న ఢిల్లీ వస్త్ర వ్యాపారి సహా ముగ్గురిని యూపీ హాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. గంగానది ఒడ్డున ఉన్న బ్రజఘాట్‌లో, నిందితులు ఒక కారులో ప్లాస్టిక్ బొమ్మను మృతదేహం వలె తయారుచేసి తీసుకొచ్చి, దహనం చేసేందుకు ప్రయత్నించారు.
ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లా బ్రిజ్‌ఘాట్ స్మశానవాటికలో గురువారం ఒక ఆశ్చర్యకర సంఘటన వెలుగు చూసింది. అంత్యక్రియల కోసం ఇద్దరు యువకులు కారులో ఒక మృతదేహాన్ని తీసుకువచ్చి చితి పేర్చి దహనానికి సిద్ధమయ్యారు. అయితే శవం చాలా తేలికగా, అసహజంగా కనిపించడంతో అక్కడ ఉన్న వారు అనుమానించారు. దానిపై కప్పిన వస్త్రాలను తొలగించగా, నిజమైన శరీరం స్థానంలో ప్లాస్టిక్ డమ్మీ ఉన్నట్లు తెలిసింది. వెంటనే స్థానికులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఇన్సూరెన్స్ మోసం లేదా ఏదైనా నేరపూరిత యత్నం కావచ్చని పోలీసులు అనుమానిస్తూ విచారణ ప్రారంభించారు. ప్లాస్టిక్ డమ్మీ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బీమా డబ్బుల కోసం ఫేక్ అంత్యక్రియలు నిర్వహించాలనుకున్న ఢిల్లీ వస్త్ర వ్యాపారి సహా ముగ్గురిని యూపీ హాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. గంగానది ఒడ్డున ఉన్న బ్రజఘాట్‌లో, నిందితులు ఒక కారులో ప్లాస్టిక్ బొమ్మను మృతదేహం వలె తయారుచేసి తీసుకొచ్చి, దహనం చేసేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన స్థానికులు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిజం తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
Last Rites Attempted on Plastic Dummy
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)