IndiGo Flight: పుల్లుగా తాగి ఇండిగో విమానంలో పాడు పని చేసిన ప్రయాణికుడు, అందరి ముందు మూత్రవిసర్జన చేస్తూ వాంతులు చేసుకుని రచ్చరచ్చ

అంతేగాక టాయిలెట్‌ బయటే మల విజర్జన చేశాడు. తాగిన మైకంలో సదరు వ్యక్తి రెస్ట్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చి ఫ్లోర్‌మీదే మూత్ర విసర్జన చేశాడు.

IndiGo Airlines (credit- ANI)

గువాహతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు వాంతులు చేసుకున్నాడు. అంతేగాక టాయిలెట్‌ బయటే మల విజర్జన చేశాడు. తాగిన మైకంలో సదరు వ్యక్తి రెస్ట్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చి ఫ్లోర్‌మీదే మూత్ర విసర్జన చేశాడు. ప్రయాణికుడు వ్యవహరించిన తీరుతో సీట్ల మధ్య నడిచే దారంతా అపరిశుభ్రంగా మారింది. తాగుబోతు ప్రవర్తనతో తోటి ప్రయాణికులందరూ తీవ్ర ఇబ్బంది పడ్డాడు.

ఈ ఘటన మార్చి 26న ఇండిగో విమానం 6E 762లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం విమానంలోని మహిళా సిబ్బంది వెంటనే స్పందించి అక్కడంతా శుభ్రం చేయాల్సి వచ్చింది. ప్రయాణికుడు చేసిన రచ్చను మహిళ క్లీన్‌ చేస్తున్న దృశ్యాలను తోటి ప్రయాణికుడు భాస్కర్‌ దేవ్‌ కొన్వర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.

Here's Viral Pic

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)