Sanjay Raut: గౌతం అదానిని ఆవుతో పోల్చిన సంజయ్ రౌత్, బీజేపీకి అదానీ పవిత్ర గోవు అని హగ్ చేసుకోవాలని సెటైర్, మిగిలిన ఆవులను మనకు వదిలిపెట్టారని చమత్కారం

అదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. శివసేన ఉద్దవ్ థాకరే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్.. ఆదాని అంశంపై విభిన్నంగా స్పందించారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డేని ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలంటూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ పిలుపునిచ్చింది.

Sanjay Raut (Photo-ANI)

అదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. శివసేన ఉద్దవ్ థాకరే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్.. ఆదాని అంశంపై విభిన్నంగా స్పందించారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డేని ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలంటూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ పిలుపునిచ్చింది. ఈ రెండు అంశాలకు ముడిపెడుతూ సంజయ్ రౌత్ వ్యంగ్యంగా మాట్లాడారు.

బీజేపీకి అదానీ పవిత్ర గోవు. అందుకే వారు పవిత్రమైన ఆవును హగ్ చేసుకుని, మిగిలిన ఆవులను వేలంటైన్స్ డే రోజు మనం హగ్ చేసుకునేందుకు వదిలిపెట్టారు’’ అంటూ సంజయ్ రౌత్ చమత్కరించారు. అయినప్పటికీ మనం గోమాతను గౌరవిస్తామంటూ, వాటి పట్ల మన ప్రేమను చూపించేందుకు ప్రత్యేకంగా ఒక రోజు అవసరం లేదని రౌత్ అన్నారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement