COVID in India: కరోనా విశ్వరూపం. దేశంలో గత 24 గంటల్లో 90,928 మందికి కరోనా, నిన్న క‌రోనా నుంచి 19,206 మంది కోలుకుని డిశ్చార్జ్

దేశవ్యాప్తంగా క‌రోనావైరస్ కల్లోలం రేపుతోంది. మొన్న ఒక్క‌రోజులో 58,097 కేసులు న‌మోదు కాగా, నిన్న 90,928 మంది క‌రోనా సోకిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న క‌రోనా నుంచి 19,206 మంది కోలుకున్నారు. 325 మంది కొవిడ్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు.

Representative Image: Coronavirus ( Photo Credits : Pixabay )

దేశవ్యాప్తంగా క‌రోనావైరస్ కల్లోలం రేపుతోంది. మొన్న ఒక్క‌రోజులో 58,097 కేసులు న‌మోదు కాగా, నిన్న 90,928 మంది క‌రోనా సోకిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న క‌రోనా నుంచి 19,206 మంది కోలుకున్నారు. 325 మంది కొవిడ్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. డైలీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉంది. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో క‌రోనాకు 2,85,401 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 3,43,41,009కు చేరింది. మృతుల సంఖ్య‌ 4,82,876గా ఉంది. 148.67 కోట్ల‌ డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 2,630కు పెరిగాయి. ఇప్పటివరకు  995 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement