Covid in India: దేశంలో 10 వేల దిగువకు పడిపోయిన కేసులు, గత 24 గంటల్లో 8,013 మందికి కరోనా, 119 మంది మృతి

దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య 10 వేల దిగువ‌కు చేరింది. నిన్న దేశంలో 8,013 కరోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 16,765 మంది కోలుకున్నారు. 119 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య 10 వేల దిగువ‌కు చేరింది. నిన్న దేశంలో 8,013 కరోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 16,765 మంది కోలుకున్నారు. 119 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,02,601 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,07,686గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 5,13,843కు పెరిగింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 177,50,86,335 డోసుల‌ వ్యాక్సిన్లు వేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement