Covid in India: రెండేళ్ల తరువాత వెయ్యికి దిగువన కేసులు, కొత్తగా 913 మందికి కరోనా, గత 24 గంటల్లో 13 మంది మృతి
దేశంలో 715 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యిలోపు నమోదయ్యాయి. కొత్తగా 913 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితులు 4,30,29,044కు చేరారు. ఇందులో 4,24,95,089 మంది బాధితులు కోలుకోగా, 5,21,358 మంది మృతిచెందారు.
దేశంలో 715 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యిలోపు నమోదయ్యాయి. కొత్తగా 913 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితులు 4,30,29,044కు చేరారు. ఇందులో 4,24,95,089 మంది బాధితులు కోలుకోగా, 5,21,358 మంది మృతిచెందారు. మరో 12,597 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, యాక్టివ్ కేసులు 13 వేల దిగువకు చేరడం గత 714 రోజుల్లో ఇదే తొలిసారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో 13 మంది వైరస్‌కు బలవగా, 1316 మంది కోలుకున్నారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉందని, యాక్టివ్ కేసులు 0.03 శాతం, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని పేర్కొన్నది. ఇప్పటివరకు 1,84,70,83,279 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement