Karnataka Shocker: 24 గంటలు బిజీగా ఉండే రైల్వే స్టేషన్లో కుళ్లిన మృతదేహం కలకలం, యశ్వంతపుర రైల్వే స్టేషన్లో ఓ డ్రమ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న యువతి బాడీని గుర్తించిన పోలీసులు

బెంగుళూరులోని యశ్వంతపుర రైల్వే స్టేషన్‌లోని డ్రమ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌ 1పై ఉన్న డ్రమ్‌ నుంచి దుర్వాసన రావడాన్ని క్లీనింగ్‌ సిబ్బంది గమనించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Representational Image (Photo Credits: ANI)

బెంగుళూరులోని యశ్వంతపుర రైల్వే స్టేషన్‌లోని డ్రమ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌ 1పై ఉన్న డ్రమ్‌ నుంచి దుర్వాసన రావడాన్ని క్లీనింగ్‌ సిబ్బంది గమనించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బట్టలతో కప్పి మూత వేసి ఉన్న ఆ డ్రమ్‌ను పోలీసులు పరిశీలించారు. కుళ్లినస్థితిలో ఉన్న మహిళ మృతదేహాం అందులో ఉండటం చూసి షాకయ్యారు.మృతురాలి వయసు 20 ఏళ్లు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్‌ నిఫుణులను అక్కడకు రప్పించి ఆధారాలు సేకరించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

Here's ANI Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now