Madhya Pradesh: మార్క్స్ మెమో ఇవ్వలేదని ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టిన విద్యార్థి, ఆ తరువాత ఆత్మాహత్యాయత్నం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన
మార్క్స్ మెమో ఇవ్వట్లేదని ప్రిన్సిపల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ పాత విద్యార్థి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బీఎం ఫార్మసీ కాలేజీలో సోమవారం చోటు చేసుకుంది.అశుతోష్ శ్రీవాత్సవ అనే విద్యార్థి గతేడాది బీ ఫార్మసీ పూర్తి చేశాడు.
మధ్యప్రదేశ్‌లోని బీఎం ఫార్మసీ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మార్క్స్ మెమో ఇవ్వట్లేదని ప్రిన్సిపల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ పాత విద్యార్థి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బీఎం ఫార్మసీ కాలేజీలో సోమవారం చోటు చేసుకుంది.అశుతోష్ శ్రీవాత్సవ అనే విద్యార్థి గతేడాది బీ ఫార్మసీ పూర్తి చేశాడు. అయితే మార్క్స్ మెమో ఇవ్వకుండా ఆ విద్యార్థిని ప్రిన్సిపల్ విముక్త శర్మ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మార్క్స్ మెమో కోసం ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.నంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ప్రిన్సిపల్‌పై పోసి నిప్పంటించాడు.
అనంతరం విద్యార్థి కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. కానీ అతన్ని పోలీసులు రక్షించాడు.ప్రిన్సిపల్ 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అశుతోష్ కూడా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. అయితే కొద్ది నెలల క్రితం ఇదే కాలేజీకి చెందిన ఫ్యాకల్టీపై అశుతోష్ కత్తితో దాడి చేసి జైలు పాలయ్యాడు. వారం రోజుల క్రితం బెయిల్‌పై విడుదలై ఈ దారుణానికి ఒడిగట్టాడు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)