Maharashtra Shocker: హత్యా లేక ఆత్మహత్యా.., ఒకే ఇంట్లో 9 మృత‌దేహాలు, 3 మృత‌దేహాలు ఒక చోట‌, మ‌రో 6 మృత‌దేహాలు ఇంట్లో వివిధ ప్రాంతాల్లో, మ‌హారాష్ట్ర‌లోని సంగ్లీ జిల్లాలో ఘటన

మ‌హారాష్ట్ర‌లోని సంగ్లీ జిల్లాలో దారుణ ఘటన బయటకు వచ్చింది. ఒకే ఇంట్లో 9 మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. ముంబైకి 350 కిలోమీట‌ర్ల దూరంలోని మ‌హైసాల్ గ్రామంలోని ఓ ఇంట్లో మృత‌దేహాలను గుర్తించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. మూడు మృత‌దేహాలు ఒక చోట‌, మ‌రో ఆరు మృత‌దేహాలు ఇంట్లోనే వివిధ ప్రాంతాల్లో ప‌డి ఉన్న‌ట్లు తెలిపారు.

Representational Image (Photo Credits: Twitter)

మ‌హారాష్ట్ర‌లోని సంగ్లీ జిల్లాలో దారుణ ఘటన బయటకు వచ్చింది. ఒకే ఇంట్లో 9 మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. ముంబైకి 350 కిలోమీట‌ర్ల దూరంలోని మ‌హైసాల్ గ్రామంలోని ఓ ఇంట్లో మృత‌దేహాలను గుర్తించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. మూడు మృత‌దేహాలు ఒక చోట‌, మ‌రో ఆరు మృత‌దేహాలు ఇంట్లోనే వివిధ ప్రాంతాల్లో ప‌డి ఉన్న‌ట్లు తెలిపారు. 9 మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన కార‌ణాల‌పై పోలీసులు దృష్టి సారించారు. పోస్టుమార్టం త‌ర్వాతే పూర్తి స్థాయి వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. వీరిని ఎవ‌రైనా హ‌త్య చేశారా? లేక వారే ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా? అనేది పోస్టుమార్టం రిపోర్టులో వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement