Haryana: ముస్లిం అమ్మాయిల పెళ్లి విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు, 16 ఏళ్లకే వారు పెళ్లి చేసుకోవచ్చని తెలిపిన హర్యానా హైకోర్టు

ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. షరియా లా ప్రకారం.. ముస్లిం అమ్మాయి 16 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం సరైనదేనని స్పష్టం చేసింది.

Court Judgment, representational image | File Photo

ముస్లిం అమ్మాయిల పెళ్లి విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. షరియా లా ప్రకారం.. ముస్లిం అమ్మాయి 16 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం సరైనదేనని స్పష్టం చేసింది. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ జంట జూన్ 8వ తేదీన ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం వారి పెళ్లిని నిరాకరిస్తూ.. కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురి చేశారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)