School Girls Fighting: వీడియో ఇదిగో, కోచింగ్ సెంటర్ నుండి బయటకు వచ్చి తన్నుకున్న అమ్మాయిలు, వారిని రెచ్చగొడుతూ ఎంజాయ్ చేసిన అబ్బాయిలు
సోషల్ మీడియాలో స్కూల్ విద్యార్థినుల ఫైటింగ్ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వీధిలో ఓ అమ్మాయి స్కూటర్ మీద కూర్చుని ఉండగా మరో అమ్మాయి ఇంకో స్కూటర్ మీద అక్కడుకు చేరుకుంది. స్కూటర్ దిగిన తర్వాత ఓ అమ్మాయి ముందు స్కూటర్‌పై కూర్చున్న అమ్మాయి మెడ పట్టుకుని చెంపదెబ్బ కొట్టడం, ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని స్కూటర్ నుంచి కిందపడేలా దాడి చేసింది.
చిరుతపులితో రీల్...ముగ్గురిపై దాడి చేసిన చిరుత, మధ్యప్రదేశ్‌లో ఘటన...వైరల్‌గా మారిన వీడియో
ఈ సమయంలో, మరికొందరు అమ్మాయిలు గొడవలో తోడవడంతో అక్కడ రణరంగం అయింది. బైక్‌లపై వచ్చిన అబ్బాయిలు కూడా ఈ గ్యాంగ్ వార్‌ని ఎంజాయ్ చేస్తూ అమ్మాయిలను రెచ్చగొడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఘటన రికార్డయింది. దీని తరువాత, ఏదో ఒక విషయంపై ఒక ఒప్పందం కుదిరడంతో ఈ గొడవ సద్దుమణిగింది. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై అధికారిక సమాచారం లేదు.
Here's Fighting Video