Kolikapudi Srinivasa Rao: వీడియో ఇదిగో, సుప్రీంకోర్టు దుర్మార్గమైన తీర్పు ఇచ్చింది, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
సుప్రీంకోర్టు తీర్పుపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు ఇచ్చిందని కొల్లికపూడి కామెంట్స్ చేశారు.విస్సన్నపేటలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ‘సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన.. దారుణమైన.. అన్యాయమైన తీర్పు ఇచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పుపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు ఇచ్చిందని కొల్లికపూడి కామెంట్స్ చేశారు.విస్సన్నపేటలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ‘సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన.. దారుణమైన.. అన్యాయమైన తీర్పు ఇచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కులాలకు రిజర్వేషన్లు అందిస్తే.. సుప్రీంకోర్టు మతాలకు ముడిపెట్టడం దారుణం. ఇలాంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినా.. ఎవరిచ్చినా తప్పు అవుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
క్రైస్తవ మతంలోకి మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే.దీనిని టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) కొలికపూడి శ్రీనివాసరావుKolikapudi Srinivasa Rao) తప్పుపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘వెనుకబడిన కులాలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉండవని చెప్పిందని తెలిపారు. ఇదొక దారుణమైన అన్యాయమైన తీర్పు అన్నారు. రాజ్యాంగం కులాలకు రిజర్వేషన్లు ఇస్తే మతానికి ముడిపెట్టడం తప్పు’ అని కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు.
Kolikapudi's sensational comments on the Supreme Court Reservations Verdict
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)