Nizamabad: నిజామాబాద్‌లో అంతర్రాష్ట దొంగల ముఠా కలకలం, భారీ మొత్తంలో దోచుకెళ్లిన దొంగలు, వీడియో ఇదిగో..

తెలంగాణలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్ చేస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ దత్తాత్రేయ ఆలయ సమీపంలో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 40 తులాల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి, రూ.2.50 లక్షల నగదు దొంగతనం చేసినట్లు తెలుస్తోంది

Thieves broke into a house near Dattatreya temple at Vinayaka Nagar in Nizamabad district headquarters

తెలంగాణలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్ చేస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ దత్తాత్రేయ ఆలయ సమీపంలో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 40 తులాల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి, రూ.2.50 లక్షల నగదు దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. అయితే, దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

జిల్లాల్లో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల జిల్లాలో పెద్దఎత్తున దొంగతనాలు జరిగాయి. దాని వెనుక ఈ అంతర్రాష్ట ముఠా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు వర్గాలు వెల్లడించాయి.

పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. పలువురు మహిళలకు తీవ్ర గాయాలు.. ఓ మహిళ పరిస్థితి విషమం

నిజామాబాద్‌లో అంతర్రాష్ట దొంగల ముఠా కలకలం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement