Union Budget 2022-23: రేపు 11 గంటలకు బడ్జెట్‌పై ప్రధాని స్పీచ్, వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది, నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టామని తెలిపిన ప్రధాని మోదీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది.

PM Modi

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. 1. ప్రధాని గతిశక్తి యోజన 2. సమీకృత అభివృద్ధి 3. అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు 4. పరిశ్రమలకు ఆర్థిక అండ ఈ అంశాలను ఆధారంగా చేసుకుంటూ బడ్జెట్‌ రూపొందించాము. దేశ యువత ఉజ్వల భవిష్యత్‌కు ఈ బడ్జెట్‌ ఉపయోగపడుతుంది.

ఉద్యోగాలు, మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాతిపదికన ఈ బడ్జెట్‌ రూపొందించింది. ఈ బడ్జెట్‌లో భారత రక్షణకు పెద్దపీట వేశాం. బడ్జెట్‌లో మహిళల కోసం మిషన్‌ శక్తి, వాత్సల్య, సక్షమ్‌ అంగన్‌వాడీల రూపకల్పన వంటి 3 ప్రత్యేక పథకాలు తీసుకొచ్చాం. గంగానది తీర రాష్ట్రాల్లో సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే ప్రయాణిస్తోంది. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. నవశకానికి నాంది పలికేలా ఈ బడ్జెట్‌ ఉంది' అని ప్రధాని నరంద్ర మోదీ అన్నారు. ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి సీతారామన్ పై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. రేపు 11 గంటలకు బడ్జెట్ పై తన ప్రసంగాన్ని వివరణాత్మకంగా వివరిస్తానని ప్రధాని అన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement