UP Horror: వీడియో ఇదిగో, తమతో కలిసి మందు తాగలేదని స్నేహితుడిని మేడపై నుంచి తోసిన స్నేహితులు, కిందపడి దెబ్బలు తగిలినా వదలకుండా పాశవిక దాడి

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కలిసి మందుకొట్టేందుకు నిరాకరించాడన్న కోపంతో రంజీత్ సింగ్ అనే యువకుడిని అతని స్నేహితుడు మేడ పైనుంచి కిందకు తోసేశాడు. అంతటితో ఆగకుండా కిందపడ్డ బాధితుడిపై అక్కడే ఉన్న మిగిలిన స్నేహితులు పాశవికంగా దాడి చేశారు.

UP Horror: Lucknow Man Pushed Off Roof By Friends For Refusing To Have Liquor Watch Video

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కలిసి మందుకొట్టేందుకు నిరాకరించాడన్న కోపంతో రంజీత్ సింగ్ అనే యువకుడిని అతని స్నేహితుడు మేడ పైనుంచి కిందకు తోసేశాడు. అంతటితో ఆగకుండా కిందపడ్డ బాధితుడిపై అక్కడే ఉన్న మిగిలిన స్నేహితులు పాశవికంగా దాడి చేశారు. లక్నోలోని రుప్పూర్ ఖాద్రా ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో బాధితుడి ఇంటికి ఎదురుగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.  వేయి రూపాయల బిర్యానీ తిన్నందుకు రూ. లక్ష రూపాయలు ఆస్పత్రి బిల్లు, రక్తపు వాంతులతో ఆస్పత్రి పాలైన హైదరాబాద్ వాసి, వీడియో ఇదిగో..

ఆ వీడియోలో ఇద్దరు యువకులు డాబాపై పెనుగులాడుతుండగా మరో యువకుడు పక్క నుంచి డాబా ఎక్కుతుండటం కనిపించింది. అనంతరం పిట్టగోడను గట్టిగా పట్టుకున్న రంజీత్ ను మరో యువకుడు అమాంతం పైకెత్తి కింద పడేయడం అందులో రికార్డయింది.రంజీత్ ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకే అంతస్తుగల ఇంటి పైనుంచి పడినందున అతనికి ప్రాణాపాయం తప్పింది. చికిత్స అనంతరం వైద్యులు అతన్ని డిశ్చార్జి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now