Viral Video: ముంబైలో దారుణం, కొరియా యువతి బుగ్గులు కొరుకుతానంటూ లైంగిక వేధింపులు, ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు

సౌత్‌ కొరియాకు చెందిన మహిళా యూట్యూబర్‌ను ముంబైలో ఇద్దరు యువకులు వేధింపులకు గురి చేశారు. బాధిత యువతి లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా నడిరోడ్డుపై ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు. ఆమె ‘నో.. నో.. నో’ అని అరుస్తున్నా పట్టించుకోలేదు.ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు.

Representational Image | (Photo Credits: PTI)

సౌత్‌ కొరియాకు చెందిన మహిళా యూట్యూబర్‌ను ముంబైలో ఇద్దరు యువకులు వేధింపులకు గురి చేశారు. బాధిత యువతి లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా నడిరోడ్డుపై ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు. ఆమె ‘నో.. నో.. నో’ అని అరుస్తున్నా పట్టించుకోలేదు.ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. వారు లిఫ్ట్ ఇస్తామని చెప్పగా నిరాకరించిన ఆమె.. తన ఇల్లు సమీపంలోనే ఉందని తెలిపింది. అనంతరం వారి నుంచి తప్పించుకుని వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now