YS Jagan Question to DGP: వీడియో ఇదిగో, నా తల్లిని చంపడానికి నేను ప్రయత్నించానంటూ టీడీపీ పేజీలో పోస్ట్ చేశారు, వారిని బొక్కలో వేసే దమ్ముందా ? డీజీపీని ప్రశ్నించిన జగన్

తల్లిని చంపడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారిక వెబ్‌ సైట్‌లో ఓ పోస్ట్‌ చేశారు. దానికి కారు టైర్‌ పేలిన పాత కథనం ఒకటి జత చేశారు

YS jagan Question to DGP tirumala rao (Photo-Video Grab)

టీడీపీ అధికారిక వెబ్‌సైట్లో‌ చేసేవన్నీ ఫేక్‌ పోస్టులేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీడియాతో ప్రస్తావించారు. తల్లిని చంపడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారిక వెబ్‌ సైట్‌లో ఓ పోస్ట్‌ చేశారు. దానికి కారు టైర్‌ పేలిన పాత కథనం ఒకటి జత చేశారు. స్వయంగా విజయమ్మే ఇది ఫేక్‌ న్యూస్‌ అని లేఖ ఇచ్చారు. కానీ, ఆ లేఖ కూడా ఫేక్‌ అని ప్రచారం చేశారు. చివరకు.. అదంతా అబద్ధమని విజయమ్మ టీవీ ముందుకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లోనే జరిగింది. మరి నారా లోకేష్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?.

గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థలో తప్పులు జరిగాయి..ఎంపీని సైతం తీసుకెళ్లి కొట్టారు, డీజీపీ ద్వారకా తిరుమల రావు సంచలన కామెంట్

ఇంతకుమించి దిగజారిపోయి.. దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా భార్య(వైఎస్‌ భారతి) కడప పోలీస్‌ అధికారితో ఫోన్‌లో మాట్లాడిందని ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ఇచ్చింది. అది ఫేక్‌ కథనం. అలాంటప్పుడు రాధాకృష్ణను జైల్లో పెడతారా?. ఎల్లో మీడియా అలానే ఉంది.. సోషల్‌ మీడియా అలానే ఉంది అని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు.

YS Jagan Question to DGP

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)