Amritpal Singh Arrested: ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్టు.. పంజాబ్ మోగాలోని రోడ్ గ్రామంలో పోలీసుల అదుపులోకి..
ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్టయ్యాడు. పంజాబ్‌లోని మోగా పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పంజాబ్ మోగాలోని రోడ్ గ్రామంలో ఇతన్ని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది.
Newdelhi, April 23: ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) అరెస్టయ్యాడు (Arrested). పంజాబ్‌లోని (Punjab) మోగా (Moga) పోలీసులు (Police) అరెస్టు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పంజాబ్ మోగాలోని రోడ్ గ్రామంలో ఇతన్ని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. కాగా అతడు మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అమృత్‌పాల్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను ఇటీవల పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.