Uttar pradesh: షాకింగ్ వీడియో..కరోనాతో చ‌నిపోయిన మృత‌దేహాన్ని బ్రిడ్జిపై నుంచి న‌దిలో పడేసిన ఓ వ్యక్తి, యూపీలో బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వ్య‌క్తులు తీసిన వీడియో వైరల్, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపిన పోలీసులు

పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్య‌క్తి కరోనాతో చ‌నిపోయిన మృత‌దేహాన్ని బ్రిడ్జిపై నుంచి న‌దిలోకి ప‌డేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో గంగ‌, య‌మున న‌దుల్లో వంద‌ల సంఖ్య‌లో శ‌వాలు తేలుతూ క‌నిపిస్తున్న త‌రుణంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

UP Man in PPE kit throws body into river (Photo-Video Grab)

పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్య‌క్తి కరోనాతో చ‌నిపోయిన మృత‌దేహాన్ని బ్రిడ్జిపై నుంచి న‌దిలోకి ప‌డేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో గంగ‌, య‌మున న‌దుల్లో వంద‌ల సంఖ్య‌లో శ‌వాలు తేలుతూ క‌నిపిస్తున్న త‌రుణంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. వర్షం పడుతుండగా ప‌ట్ట‌ప‌గ‌లు, బ్రిడ్డిపై వాహ‌నాలు తిరుగుతున్న స‌మ‌యంలోనే ఆ వ్యక్తి మ‌రొక‌రి సాయంతో ఇలా మృత‌దేహాన్ని న‌దిలోకి ప‌డేయ‌డం షాక్ లాంటిదే. ఈ నెల 28న జరిగిన ఈ ఘ‌ట‌న‌ను ఆ స‌మ‌యంలో బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వ్య‌క్తులు వీడియో తీశారు. అది కొవిడ్ పేషెంట్ మృత‌దేహ‌మేన‌ని బ‌ల్‌రామ్‌పూర్ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ బీబీ సింగ్‌ చెప్పారు. ఇప్ప‌టికే బంధువుల‌పై కేసు న‌మోదు చేశారు. వాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement