Jane Zhang Covid: ఇదేమి పోయేకాలం, కావాలనే కరోనా అంటించుకున్న స్టార్ సింగర్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసమే ఇదంతా చేశానని వెల్లడి, అభిమానుల ఆగ్రహంతో సారీ చెప్పిన చైనా సింగర్ జేన్‌ జాంగ్‌

చైనాకు చెందిన స్టార్‌ సింగర్‌ జేన్‌ జాంగ్‌ కావాలనే కరోనా వైరస్‌ను అంటించుకున్నట్లు వీబోలో వెల్లడించింది.తన స్నేహితుల ద్వారా కరోనా వైరస్‌ను ఉద్దేశపూర్వకంగానే అంటించుకున్నట్లు తెలిపారు.

Chinese Singer Jane Zhang (Photo-Twitter)

చైనాకు చెందిన స్టార్‌ సింగర్‌ జేన్‌ జాంగ్‌ కావాలనే కరోనా వైరస్‌ను అంటించుకున్నట్లు వీబోలో వెల్లడించింది.తన స్నేహితుల ద్వారా కరోనా వైరస్‌ను ఉద్దేశపూర్వకంగానే అంటించుకున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా ఈ నెల 31 న కన్సర్ట్‌ ఉండటంతో కరోనా వ్యాప్తి చెందితే కార్యక్రమం నిలిచిపోతుందని తొలుత భయపడిందంట.

దాంతో ముందుగానే తాను కరోనా అంటించుకుంటే న్యూ ఇయర్‌ కన్సర్ట్‌ లోపు తగ్గిపోతుందని, ఆ రోజున మళ్లీ రాదని ఇలా చేసినట్లు జేన్‌ జాంగ్‌ చైనా సోషల్ మీడియా పాట్‌ఫాం వీబోలో తెలిపింది.ఆమెకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అభిమానులు సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో జాంగ్‌ తన పోస్ట్‌ను తొలగించింది. అలాగే మరో పోస్ట్‌ చేసి ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

Here's Update

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement