Varanasi Horror: వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డామంటూ సూసైడ్ నోట్.. బాధితులు తూర్పు గోదావరి జిల్లావాసులుగా గుర్తింపు

వారణాసి పుణ్యక్షేత్రంలో ఘోరం జరిగింది. నలుగురు సభ్యులున్న ఓ తెలుగు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

Suicide (Photo Credits: Twitter)

Varanasi, Dec 8: వారణాసి (Varanasi) పుణ్యక్షేత్రంలో ఘోరం జరిగింది. నలుగురు సభ్యులున్న ఓ తెలుగు కుటుంబం (Telugu Family) ఆత్మహత్య (Suicide) చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొండా వప్రియ (50) తన భార్య లావణ్య (45) పిల్లలు రాజేశ్ (25), జైరాజ్‌లతో (23) కలిసి కైలాశ్ భవన్‌ లో ఆశ్రయం పొందుతున్నారు. డిసెంబర్ 3న వారు ఆ ధర్మశాలలో చేరారు. అయితే, గురువారం కుటుంబం అంతా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.  ఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ కూడా లభించిందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేకే తాము బలవన్మరణానికి పాల్పడినట్టు వారు చిట్టీలో రాశారని పేర్కొన్నారు.

KCR Injured: కేసీఆర్‌ కు గాయం.. కాలుజారి పడటంతో కాలి ఎముక విరిగినట్లు అనుమానం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement