Gujarat: వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్డుపై యోగసనాలు వేసిన యువతి, పోలీసుల నుంచి రియాక్షన్ ఏంటంటే..
ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇది పోలీసులకు చేరింది. నడి రోడ్డుపై ఏంటీ చేష్టలంటూ మండిపడ్డ పోలీసులు ఆ యువతికి జరిమానా విధించారు
సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో గుజరాత్‌లో బిజీ రోడ్డుపై ఓ యువతి యోగాసనాలు వేసింది.. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇది పోలీసులకు చేరింది. నడి రోడ్డుపై ఏంటీ చేష్టలంటూ మండిపడ్డ పోలీసులు ఆ యువతికి జరిమానా విధించారు. అంతేకాదు, తప్పు చేశానంటూ క్షమాపణ చెప్పించడంతో పాటు మీరు ఇలా చేయొద్దని ఆమెతోనే చెప్పించారు. ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. గుజరాత్ పోలీసులు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుజరాత్ కు చెందిన దినా పార్మర్ అనే యువతి రోడ్డుపై యోగా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోడ్డుపై ఆమె యోగాసనం వేస్తుండడంతో వెనక పలు వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు వర్షం కురుస్తుండగా నడి రోడ్డుపై ఇలా యోగా చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. రోడ్డు మీద నడిచేటప్పుడే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటే.. ఇలా నిర్లక్ష్యంగా యోగా చేయడమేంటని మండిపడ్డారు. దినా పార్మర్ ను అదుపులోకి తీసుకుని చివాట్లు పెట్టారు. అనంతరం ఫైన్ కట్టించుకుని, పబ్లిక్ కు క్షమాపణ చెప్పించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)