Viral News: ఇదేందయ్యా ఇది?? ఒకే రోజు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరుసార్లు ఆగిన మనిషి గుండె.. ఎక్కడ??
ఇదో విచిత్రమైన ఘటన. బ్రిటన్ లో ఓ ఇండో అమెరికన్ విద్యార్థి గుండె ఒకే రోజు ఆరుసార్లు ఆగింది. వైద్యుల శస్త్రచికిత్సతో మొత్తానికి అతడు ప్రాణాపాయం నుంచి కోలుకున్నాడు.
London, Oct 6: ఇదో విచిత్రమైన ఘటన. బ్రిటన్ (Britain) లో ఓ ఇండో అమెరికన్ విద్యార్థి గుండె ఒకే రోజు ఆరుసార్లు ఆగింది. వైద్యుల శస్త్రచికిత్సతో మొత్తానికి అతడు ప్రాణాపాయం నుంచి కోలుకున్నాడు. టెక్సాస్ లోని బేలార్ యూనివర్సిటీలో ప్రీ మెడ్ డిగ్రీ చదువుతున్న అతుల్ రావు పల్మనరీ ఎంబోలిజం (Pulmonary Embolism) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీని కారణంగా రక్తం సరఫరా కాక గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడేది. ఇలా ఐదారు సార్లు ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొన్న అతుల్ లండన్ లోని ఇంపీరియల్ హెల్త్ కేర్ కు చెందిన ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్టు దవాఖానలో శస్త్ర చికిత్సలు చేయడంతో కోలుకున్నాడు.
Singareni Bonus: 16న సింగరేణి దసరా బోనస్.. ఒక్కో కార్మికుడికి 1.53 లక్షలు.. బోనస్ లెక్కింపు ఇలా..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)