Jharkhand Shocker: ఉన్మాదిలా మారిన ప్రియుడు, పంట పొలాల్లోకి తీసుకెళ్లి ప్రేయసిని చిత్రహింసలకు గురి చేసిన పశువు, ఘటనపై సీరియస్ అయిన జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్

జార్ఖండ్ రాష్ట్రంలో 16 ఏండ్ల యువ‌కుడు ప‌శువులా ప్ర‌వ‌ర్తించాడు. త‌న ప్రేయ‌సిని పంట పొలాల్లోకి తీసుకెళ్లి చిత్రహింస‌ల‌కు గురి చేశాడు. ఆ విద్యార్థినిని త‌న కాళ్ల‌తో ఘోరంగా తంతూ పరుగెత్తించాడు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో వెలుగు చూసింది. బాధితురాలు కింద ప‌డిపోయినా క‌నిక‌రం చూప‌కుండా.. ఆమెపై విరుచుకుప‌డ్డాడు.

Boy Assaults School Girl in Jharkhand. (Photo Credits: Twitter)

జార్ఖండ్ రాష్ట్రంలో 16 ఏండ్ల యువ‌కుడు ప‌శువులా ప్ర‌వ‌ర్తించాడు. త‌న ప్రేయ‌సిని పంట పొలాల్లోకి తీసుకెళ్లి చిత్రహింస‌ల‌కు గురి చేశాడు. ఆ విద్యార్థినిని త‌న కాళ్ల‌తో ఘోరంగా తంతూ పరుగెత్తించాడు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో వెలుగు చూసింది. బాధితురాలు కింద ప‌డిపోయినా క‌నిక‌రం చూప‌కుండా.. ఆమెపై విరుచుకుప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌ను యువ‌కుడి స్నేహితులు రికార్డ్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేశారు. ఈ ఘ‌ట‌న 15 రోజుల క్రితం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. యువ‌కుడు తొమ్మిదో త‌ర‌గ‌తి చదువుతున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ సీరియ‌స్‌గా స్పందించారు. బాలిక ప‌ట్ల దారుణంగా ప్ర‌వ‌ర్తించిన యువ‌కుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు సీఎం సూచించారు. దీంతో ఆ యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు త‌ర‌లించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement