Karnataka Shocker: ఇన్‌ స్టా రీల్స్‌ కు బానిసైన భార్య.. వద్దని వారించి, వినకపోవడంతో విసిగిపోయి.. భరించలేక భర్త ఆత్మహత్య.. కర్ణాటకలో ఘోరం

సామాజిక మాధ్యమాల పట్ల అతిగా ఆకర్షితులవుతుండటం ఎలాంటి దారుణాలకు కారణం అవుతుందో కర్ణాటకలో జరిగిన ఘోరాన్ని బట్టి అర్థమవుతున్నది. చామరాజనగరలో కుమార్‌ అనే వ్యక్తి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు.

Representational Image (File Photo)

Bengaluru, Feb 16: సామాజిక మాధ్యమాల (Social Media) పట్ల అతిగా ఆకర్షితులవుతుండటం ఎలాంటి దారుణాలకు కారణం అవుతుందో కర్ణాటకలో (Karnataka) జరిగిన ఘోరాన్ని బట్టి అర్థమవుతున్నది. చామరాజనగరలో కుమార్‌ అనే వ్యక్తి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఆయన భార్య నిరంతరం ఇన్‌ స్టాగ్రామ్‌ రీల్స్‌ (Insta Reels) చేస్తూ, అప్‌ లోడ్‌ చేస్తుండేవారు. ఇన్‌ స్టాగ్రామ్‌ ను అతిగా చూడటంపై భర్త అభ్యంతరం చెప్పినా ఆమె వినలేదు. దీంతో ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. చివరికి భార్య వైఖరితో విసిగి, భరించలేని కుమార్‌ గురువారం ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

PM Modi Qatar Visit: ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఖతార్ పర్యటన, వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించడంపై దృష్టి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now