Man Eating Live Snake: షాకింగ్ వీడియో ఇదిగో, బతికి ఉన్న పామును కసకస నమిలి మింగేసిన గ్యాంగ్‌స్టర్, బిత్తరపోయి చూస్తుండిపోయిన స్థానికులు

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ వ్యక్తి బతికి ఉన్న పామును తినడం ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగా ప్రసాద్ కేవత్ అలియాస్ ఫౌజీపై ఫతేపూర్, బండాలో పలు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో అతనికి జీవిత ఖైదు పడింది.

Ganga Prasad Kewat alias Fauji Who Came from Jail Eating Live Snake Video Viral in Social Media

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ వ్యక్తి బతికి ఉన్న పామును తినడం ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగా ప్రసాద్ కేవత్ అలియాస్ ఫౌజీపై ఫతేపూర్, బండాలో పలు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో అతనికి జీవిత ఖైదు పడింది. శిక్ష ముగించుకుని రెండ్రోజుల క్రితం తిరిగొచ్చిన అతను ఇప్పుడు నేరాల ప్రపంచాన్ని వదిలి యమునా నదిలో చేపల వేట మొదలుపెట్టాడు. ఇంతలో విషసర్పాలను పట్టుకుని తినడం ప్రారంభించాడని గ్రామంలో ప్రచారం జరిగింది. దీన్ని ప్రజలు నమ్మలేకపోయారు.  హర్యానాలో బోల్తాపడిన స్కూలు బస్సు, 40 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

ఐదు రోజుల క్రితం గంగా ప్రసాద్ కేవత్ అలియాస్ ఫౌజీ యమునా తీరంలో చేపలను వేటాడుతుండగా పడవ కింద పాము వచ్చింది. మరికొందరు వేటగాళ్లు పామును చూసి పారిపోవడం మొదలుపెట్టారు, కానీ గంగా ప్రసాద్ దానిని పట్టుకున్నాడు. అతను పాము నోటిని పట్టుకుని, నీటితో కడిగి, సజీవంగా తినడం ప్రారంభించాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. గ్యాంగ్‌స్టర్‌ శంకర్‌ మృతి తర్వాత గంగా ప్రసాద్‌ అలియాస్‌ ఫౌజీ స్వయంగా ముఠాను నడిపేవాడు. అతను బండా జిల్లా కమాసిన్ పోలీస్ స్టేషన్‌లోని కగర్ గ్రామ నివాసి. ప్రస్తుతం, అతను ఫతేపూర్‌లోని కిషన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్‌గంజ్ తీహార్ గ్రామంలో తన అత్తమామలతో నివసిస్తున్నాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now