Thammana Gang in Coimbatore: మారణాయుధాలతో తమన్నా రౌడీ గ్యాంగ్ హల్‌చల్, సిగరెట్‌ తాగుతూ.. వీడియోలు ఫోజులు ఇచ్చిన లేడీ కోసం వెతుకుతున్న కోయంబత్తూర్‌ పోలీసులు

తమిళనాడు కోయంబత్తూర్‌లో తమన్నా అనే ఓ రౌడీ లేడి కొందరు యువకులను వెంటబెట్టుకుని హంగామా చేస్తోంది.గ్యాంగ్‌లో ఉన్న వారంత మారణాయుధాలు చేతిలో పట్టుకుని వీడియోలో ఫోజులు ఇవ్వడం కలకలం సృష్టించింది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. లేడీ రౌడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Thammana Gang (Photo-Video Grab)

తమిళనాడు కోయంబత్తూర్‌లో తమన్నా అనే ఓ రౌడీ లేడి కొందరు యువకులను వెంటబెట్టుకుని హంగామా చేస్తోంది.గ్యాంగ్‌లో ఉన్న వారంత మారణాయుధాలు చేతిలో పట్టుకుని వీడియోలో ఫోజులు ఇవ్వడం కలకలం సృష్టించింది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. లేడీ రౌడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోయంబత్తూరులోని విరుదునగర్‌కు చెందిన వినోదిని అలియాస్‌ తమన్నాకొంత మంది యువకులతో ‍గ్యాంగ్‌ ఏర్పాటు చేసింది.

ఈ గ్యాంగ్‌ వారం క్రితం ఓ యువకుడిని హత్య చేసింది.ఈ లేడీ రౌడీ మారణాయుధాలు చేతిలో పట్టుకుని సిగరెట్‌ తాగుతూ.. వీడియోలు ఫోజులు ఇస్తూ అవతలి గ్యాంగ్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు కోయంబత్తూరు పోలీసు కమిషనర్‌ వి. బాలకృష్ణన్‌ తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now