Madurai School Girls Fight: వీళ్లేమి స్టూడెంట్స్.. నడిరోడ్డు మీద బట్టలు చించుకునేలా తన్నుకున్న విద్యార్థినులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

మదురై పెరియార్‌ టౌన్‌ బస్టాండ్‌లో పదుల సఖ్యలో రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు హఠాత్తుగా ముష్టియుద్ధానికి దిగారు. తన్నులు తాళ లేక కొందరు పారిపోతున్నా, వెంటాడి మరీ మరి కొందరు విద్యార్థినులు కొట్టడం గమనార్హం. శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విద్యార్థినులు తగ్గేదేలేదన్నట్టుగా గొడవ పడిన వీడియో రాత్రి సమయంలో వైరల్‌గా మారింది.

Madurai School Girls Fight (Photo-Video Grab)

మదురై పెరియార్‌ టౌన్‌ బస్టాండ్‌లో పదుల సఖ్యలో రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు హఠాత్తుగా ముష్టియుద్ధానికి దిగారు. తన్నులు తాళ లేక కొందరు పారిపోతున్నా, వెంటాడి మరీ మరి కొందరు విద్యార్థినులు కొట్టడం గమనార్హం. శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విద్యార్థినులు తగ్గేదేలేదన్నట్టుగా గొడవ పడిన వీడియో రాత్రి సమయంలో వైరల్‌గా మారింది. అర్ధ గంట తర్వాత రంగంలోకి పోలీసులు దిగడంతో విద్యార్థినులు పత్తా లేకుండా పోయారు. అయితే, విద్యార్థులు చిత్రీకరించిన వీడియో రాత్రి సమయంలో వైరల్‌గా మారింది.

విద్యార్థినుల ఫైట్‌ను ప్రోత్సహించే విధంగా మరి కొందరు విద్యార్థులు ఈల గోల చేయడం వంటి దృశ్యాలు వీడియోలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఘటనను విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. కాగా తిరునల్వేలిలో విద్యార్థుల గొడవలో ఓ విద్యార్ధి మరణాన్ని విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాలలోని ఇద్దరు టీచర్లను సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.అలాగే, కడలూరులో శుక్రవారం గొడవ పడ్డ 14 మంది విద్యార్థుల పై కేసులు నమోదు అయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement