JC Prabhakar Reddy Dance Video: వీడియో ఇదిగో, అమ్మాయిలతో జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ డ్యాన్స్, సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామికి కాలు కదిపిన టీడీపీ నేత
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024 డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలలో జేసీ ప్రభాకర్ రెడ్డి పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే సాంగ్‌కు డ్యాన్స్ వేశారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024 డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలలో జేసీ ప్రభాకర్ రెడ్డి పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే సాంగ్‌కు డ్యాన్స్ వేశారు. పక్కన ఉన్న మహిళలు, అమ్మాయిలతో కలసి కాలు కదిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా ఈ ఈవెంట్‌కు ముందు సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దానిపై జేసీ ఘాటుగా స్పందించారు. మాధవీలత ఒక ప్రాస్టిట్యూట్ అని, అలాంటి వాల్లు తన గురించి మాట్లాడుతారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తరువాత అనంతపురంలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి.దీనిపై బీజేపీ నేతలపై దారుణ పదజాలంతో మండిపడ్డారు జేసీ.
JC Prabhakar Reddy Dance Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)