Telangana Horror: దారుణం, భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో కూతురుని బావిలో తోసి హత్య చేసిన తండ్రి, వీడియో ఇదిగో..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో ఇద్దరు కూతుర్లని హత్య చేశాడో ఓ కసాయి తండ్రి. ఈ ఘటన (Telangana Horror) ఆలస్యంగా వెలుగు చూసింది. రాయికోడ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Father kills daughter in anger over wife leaving him

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో ఇద్దరు కూతుర్లని హత్య చేశాడో ఓ కసాయి తండ్రి. ఈ ఘటన (Telangana Horror) ఆలస్యంగా వెలుగు చూసింది. రాయికోడ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాయికోడు మండలం సంగాపూర్​కు చెందిన సతీష్ అనే వ్యక్తి ఓ మహిళను కులాంతర వివాహం చేసుకున్నాడు.అయితే పెళ్లయిన కొన్ని రోజులకే భార్య అతడిని విడిచి వెళ్లిపోయింది.

భార్యను చంపే ముందు వీధి కుక్క మీద ప్రయోగం, మీర్ పేట్ మహిళ హత్య కేసులో సంచలన విషయాలు, పోలీసులు అదుపులో నిందితుడు రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ గురు మూర్తి

దీంతో కోపంతో రగిలిపోయిన అతను ఈనెల 9న తన కూతురు వైష్ణవి(11)ని గ్రామ పొలిమేరలోని వ్యవసాయ బావిలోకి తోసేసి (Father kills daughter) హత్య చేశాడు. 16వ తేదీన ఆ బావిలో వైష్ణవి మృతదేహం కనిపించడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు వైష్ణవి నానమ్మ ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.భార్య తనను వదిలివెళ్లిందన్న కక్షతోనే కూతురును హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు వెల్లడించారు.నిందితుడు సతీష్​పై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. నెల రోజుల క్రితం సతీష్ చిన్న కూతురు కూడా అనుమానాస్పద స్థితిలోనే చనిపోయింది. ఆ చిన్నారిని కూడా సతీష్ హత్య చేసి ఉంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Father kills daughter in anger over wife leaving him 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now