Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి పోలీసుల యూనిఫాం చింపేస్తూ నానా హంగామా చేసిన ముగ్గురు యువతులు, చివరకు ఏమైందంటే..

ముంబై శివార్లలోని ఓ బార్ లో ముగ్గురు యువతులు లేట్ నైట్ పార్టీ చేసుకున్నాక వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో పోలీసులపైనే దాడి చేశారు.ముంబైలోని విరార్ ప్రాంతంలో ఉన్న గోకుల్ టౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది

Three Intoxicated Women Assault Police Officers in Virar, Arrests Made After Violent Confrontation

ముంబై శివార్లలోని ఓ బార్ లో ముగ్గురు యువతులు లేట్ నైట్ పార్టీ చేసుకున్నాక వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో పోలీసులపైనే దాడి చేశారు.ముంబైలోని విరార్ ప్రాంతంలో ఉన్న గోకుల్ టౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బార్ అండ్ రెస్టారెంట్ బయట ముగ్గురు యువతులు హంగామా చేస్తున్నారంటూ కొందరు స్థానికులు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. పెళ్లి చేసుకోలేదని బాలిక తల నరికి తీసుకుని పారిపోయిన యువకుడు, కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన

కానీ నిషా తలకెక్కడంతో ఆ యువతులు పోలీసులతో తొలుత వాగ్వాదానికి దిగారు. ఇష్టం వచ్చినట్లుగా వారిని దుర్భాషలాడారు. ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ చెయ్యి కొరకడమే కాకుండా ఆమె యూనిఫాంను చించేశారు. మరో కానిస్టేబుల్ తలపై బకెట్ తో బాదారు. అలాగే అతని చేతినీ కొరికారు. నిందితులను కావ్య, అశ్వని, పూనంగా గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement