Girl Dancing in Hyd Metro: వైరల్ వీడియో.. హైద‌రాబాద్‌ మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, కేసు నమోదు

హైద‌రాబాద్‌లోని ఓ మెట్రో స్టేష‌న్‌లో ఓ యువతి డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ట్రెడిష‌న‌ల్ డ్ర‌స్ ధ‌రించిన ఆ యువ‌తి.. రా.. రా.. అనే పాట‌కు స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో స్టెప్పులేయ‌గా, మ‌రో పాట‌కు ఏకంగా క‌దులుతున్న రైల్లోనే మాస్ స్టెప్పులేసి అంద‌ర్నీ మైమ‌రిపించింది.

Girl dancing in Hyderabad metro goes viral

హైద‌రాబాద్‌లోని ఓ మెట్రో స్టేష‌న్‌లో ఓ యువతి డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ట్రెడిష‌న‌ల్ డ్ర‌స్ ధ‌రించిన ఆ యువ‌తి.. రా.. రా.. అనే పాట‌కు స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో స్టెప్పులేయ‌గా, మ‌రో పాట‌కు ఏకంగా క‌దులుతున్న రైల్లోనే మాస్ స్టెప్పులేసి అంద‌ర్నీ మైమ‌రిపించింది. అయితే ఆమె డ్యాన్స్ వేసిన రెండు వీడియోలు మెట్రో రైల్ అధికారుల‌కు చేరాయి. ఆ అమ్మాయి వీడియోల‌పై అధికారులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌యాణికుల‌ను ఇబ్బంది పెట్టేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. వీడియో చేసిన యువ‌తిపై మెట్రో అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement