13 Runs From 1 Ball: ఒక బాల్‌కి 13 పరుగులు, ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్, వీడియో ఇదిగో..

Yashasvi Jaiswal World Record

భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal)  ఒక్క బంతిలోనే 12 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన చివరి మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. సికందర్ రజా మొదటి ఓవర్‌లో తొలి బంతిని ఫుల్-టాస్‌గా వేయగా.. దానిని జైస్వాల్ డీప్ స్క్వేర్ లెగ్ మీద సిక్సర్‌గా మలిచాడు. అయితే.. ఆ బంతి నో-బాల్ కావడంతో భారత్‌కు ఫ్రీ-హిట్ వచ్చింది.అదే ఊపులోనే జైస్వాల్ తర్వాతి బంతినీ సిక్సర్‌గా మార్చాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఓ లీగల్ డెలివరీలో 12 పరుగులు (నో-బాల్‌తో కలిపితే 13) చేసిన ఏకైక క్రికెటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. చివరి టీ20లో భారత్ 42 పరుగులతో ఘనవిజయం సాధించింది.ఈ విజయంతో భారత్ 4-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. వైరల్ వీడియోపై వివరణ ఇచ్చిన హర్భజన్ సింగ్, ఎవరి మనసులు అయినా గాయపడి ఉంటే చింతిస్తున్నామని వెల్లడి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement