T20 World Cup 2022: వీడియో, ప్రపంచకప్‌ 2022లో అత్యంత భారీ సిక్సర్‌, 106 మీటర్ల దూరం బాదిన పాక్ బ్యాటర్ ఇఫ్తికార్‌ అహ్మద్‌, అవాక్కయి అలా చూస్తుండిపోయిన బౌలర్ ఎంగిడి

టీ20 వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా సౌతాఫ్రికా-పాకిస్తాన్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 3) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ 106 మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డ్‌ అయ్యింది.

Iftikhar Ahmed (Photo-Twitter)

టీ20 వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా సౌతాఫ్రికా-పాకిస్తాన్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 3) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ 106 మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డ్‌ అయ్యింది. ఎంగిడి వేసిన 16వ ఓవర్‌ నాలుగో బంతిని ఇఫ్తికార్‌ అహ్మద్‌.. డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి సాగనంపాడు. ఇఫ్తికార్‌ ఈ షాట్‌ ఆడిన విధానాన్ని చూసి బౌలర్‌ ఎంగిడి అవాక్కయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతుంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement