Mohammed Siraj Crying Video: వీడియో ఇదిగో, వెక్కి వెక్కి ఏడ్చిన మహ్మద్ సిరాజ్, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న భారత ఆటగాళ్లు
ప్రపంచకప్ 2023ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని భారత ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కొందరు ఆటగాళ్లు లోలోన మథనపడితే మహ్మద్ సిరాజ్ అయితే వెక్కివెక్కి ఏడ్చేశాడు. బుమ్రా అతడిని ఓదార్చాడు. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా విషణ్ణ వదనాలతో కనిపించారు.
ప్రపంచకప్ 2023ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని భారత ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కొందరు ఆటగాళ్లు లోలోన మథనపడితే మహ్మద్ సిరాజ్ అయితే వెక్కివెక్కి ఏడ్చేశాడు. బుమ్రా అతడిని ఓదార్చాడు. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా విషణ్ణ వదనాలతో కనిపించారు. మ్యాచ్‌ను కోల్పోయిన వెంటనే సిరాజ్ నియంత్రించుకోలేకపోయాడు. కళ్లలోంచి అప్రయత్నంగానే నీళ్లు ఉబికి వచ్చాయి. గమనించిన బుమ్రా సహా ఇతర ఆటగాళ్లు అతడిని ఓదార్చారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)