IND vs ENG, 5th Test: భారత క్రికెట్ అభిమానులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ అభిమానులు, ట్విట్టర్‌లో ఫోటోలు, వీడియోలు వైరల్, స్పందించిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు
Edgbastonలో భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగిన అయిదోవ టెస్టు నాలుగవ రోజున బర్మింగ్‌హామ్‌లో భారతీయ క్రికెట్ అభిమానులపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ వాళ్లు ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Edgbastonలో భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగిన అయిదోవ టెస్టు నాలుగవ రోజున బర్మింగ్‌హామ్‌లో భారతీయ క్రికెట్ అభిమానులపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ వాళ్లు ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ట్విట్టర్‌లోనూ ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెంటనే స్పందించింది. తన అధికారిక ట్విట్టర్‌లో రియాక్ట్ అవుతూ ఈ అంశాన్ని దర్యాప్తు చేయనున్నట్లు ఈసీబీ తన ప్రకటనలో తెలిపింది. టెస్టు మ్యాచ్ సమయంలో జాత్యాంహకార ఆరోపణలు జరిగిన వస్తున్న వార్తల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఈసీబీ వెల్లడించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఉన్న అందరితోనూ ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఈసీబీ తెలిపింది.