IPL Auction 2023: ఐపీఎల్ వేలంలో 405 మంది ప్లేయర్లు, వీరిలో 273 మంది భారతీయులు, 132 విదేశీ ఆటగాళ్లు, డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో మధ్యాహ్నం 2:30 గంటలకు వేలం పాట
స్వదేశంలో జరగనున్న ఐపీఎల్ 2023కి సర్వం సిద్ధం అయింది.వేలంలో ఉన్న ఆటగాళ్ల తుది జాబితాను ఐపీఎల్ పాలక మండలి మంగళవారం విడుదల చేసింది. 405 మంది ప్లేయర్లు వేలంలో నిలిచారు. వీళ్లలో 273 మంది భారతీయులు, 132 విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ 2023 కోసం 991 మంది ఆటగాళ్లు పేర్లు నమోదుచేసుకున్నారు.
స్వదేశంలో జరగనున్న ఐపీఎల్ 2023కి సర్వం సిద్ధం అయింది.వేలంలో ఉన్న ఆటగాళ్ల తుది జాబితాను ఐపీఎల్ పాలక మండలి మంగళవారం విడుదల చేసింది. 405 మంది ప్లేయర్లు వేలంలో నిలిచారు. వీళ్లలో 273 మంది భారతీయులు, 132 విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ 2023 కోసం 991 మంది ఆటగాళ్లు పేర్లు నమోదుచేసుకున్నారు. అయితే, వీళ్లలో 391 మందిని 10 జట్లు షార్ట్ లిస్ట్ చేశాయి. ఆ తర్వాత 36 మందిని వేలం జాబితాలో చేర్చాలని ఫ్రాంఛైజీలు కోరాయి. దాంతో, 405 మంది ఆటగాళ్లతో తుది జాబితాను రూపొందించింది. ప్రస్తుత వేలంలో 89 స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇందులో 30 స్లాట్స్‌ను విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. ఈ సీజన్ ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ హక్కులను టాటా కంపెనీ సొంతం చేసుకుంది.డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో మధ్యాహ్నం 2:30 గంటలకు వేలం పాట మొదలుకానుంది.
Here's Total List