Lightning Strike Kills Player: షాకింగ్ వీడియో ఇదిగో, ఫుట్‌బాల్ ఆటగాడిపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి, షాక్‌తో కళ్లు తిరిగిపడిపోయిన మిగతా ఆటగాళ్లు
ఓ ఫుట్ బాల్ స్టేడియంలో పిడుగు పడడంతో ఆటగాడు దుర్మరణం పాలయ్యాడు. ఆటగాడిపై పిడుగు పడడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు తీవ్ర షాక్ కు గురయ్యారు. పెరూలోని హువాన్ కాయో ప్రాంతంలో ఓ సాకర్ మ్యాచ్ నిర్వహించారు.
పెరూలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫుట్ బాల్ స్టేడియంలో పిడుగు పడడంతో ఆటగాడు దుర్మరణం పాలయ్యాడు. ఆటగాడిపై పిడుగు పడడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు తీవ్ర షాక్ కు గురయ్యారు. పెరూలోని హువాన్ కాయో ప్రాంతంలో ఓ సాకర్ మ్యాచ్ నిర్వహించారు.ఈ మ్యాచ్ మధ్యలో వర్షం పడడంతో రిఫరీ మ్యాచ్ నిలిపివేశారు.
ఆటగాళ్లు తమ డగౌట్ కు వెళుతుండగా, పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దాంతో ఓ ఆటగాడు, రిఫరీ కుప్పకూలిపోయారు. రిఫరీకి తీవ్రగాయాలు కాగా, ఆటగాడు నేరుగా పిడుగుపాటుకు గురికావడంతో అక్కడిక్కడే మరణించాడు. మరో నలుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తాలూకు వీడియోను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఏంఏ) తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది.
Lightning strike kills player during soccer match in Peru
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)