IPL 2022: వీడియో ఇదే..నాలుగు బంతుల్లో 16 పరుగులు, కేక పుట్టించిన ధోనీ ఫినిషింట్ ట‌చ్‌, సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషింగ్ టచ్ వీడియో

నాలుగు బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా.. ఆ ద‌శ‌లో ధోనీ త‌న స్ట‌యిల్లో చెలరేగిపోయాడు. మూడో బంతికి బౌలర్‌ తల మీదుగా భారీ సిక్సర్‌ అరుసుకున్న ధోనీ.. నాలుగో బాల్‌కు ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండ్రీ రాబట్టాడు. ఐదో బంతికి రెండు పరుగులు రాగా.. ఆఖరి బాల్‌కు ఫోర్‌ కొట్టిన ధోనీ తనదైన శైలిలో మ్యాచ్‌కు ఫినిషింగ్ ఇచ్చేశాడు.

MS Dhoni (Photo credit: Twitter)

మహేంద్ర సింగ్ ధోనీ మ‌రోసారి ఫినిషింట్ ట‌చ్‌తో అదరగొట్టాడు. ఐపీఎల్‌లో గురువారం ముంబైతో జ‌రిగిన మ్యాచ్ ఫైన‌ల్ ఓవ‌ర్‌లో థ్రిల్లింగ్ ఇన్నింగ్స్‌తో ధోనీ ఆక‌ట్టుకున్నాడు. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన దశలో.. ఉనాద్కట్‌ వేసిన తొలి బంతికి ప్రిటోరియస్‌ ఔట్‌ కాగా.. రెండో బంతికి బ్రేవో సింగిల్‌ తీసి ధోనీకి స్ట్రయికింగ్‌ ఇచ్చాడు. దీంతో  నాలుగు బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా.. ఆ ద‌శ‌లో ధోనీ త‌న స్ట‌యిల్లో చెలరేగిపోయాడు. మూడో బంతికి బౌలర్‌ తల మీదుగా భారీ సిక్సర్‌ అరుసుకున్న ధోనీ.. నాలుగో బాల్‌కు ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండ్రీ రాబట్టాడు. ఐదో బంతికి రెండు పరుగులు రాగా.. ఆఖరి బాల్‌కు ఫోర్‌ కొట్టిన ధోనీ తనదైన శైలిలో మ్యాచ్‌కు ఫినిషింగ్ ఇచ్చేశాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement