IPL 2022: వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై, 12 పరుగుల తేడాతో ముంబైకి షాకిచ్చిన పంజాబ్‌ కింగ్స్‌, ఐపీఎల్‌ సీజన్‌లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఓడిన తొలి జట్టుగా ముంబై రికార్డు

ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. ఐదో మ్యాచ్‌లోనైనా గెలుపు బోణీ కొట్టాలన్న ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్‌ ఆశలు నెరవేరలేదు. బుధవారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 12 పరుగులతో ముంబైకి షాకిచ్చింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 198/5 స్కోరు చేసింది.

Mayank Agarwal, Shikhar Dhawan (Twitter/IPL)

ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. ఐదో మ్యాచ్‌లోనైనా గెలుపు బోణీ కొట్టాలన్న ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్‌ ఆశలు నెరవేరలేదు. బుధవారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 12 పరుగులతో ముంబైకి షాకిచ్చింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 198/5 స్కోరు చేసింది. ధవన్‌ (50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) మయాంక్‌ అగర్వాల్‌ (32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) హాఫ్‌ సెంచరీలు చేశారు. చివర్లో జితేశ్‌ శర్మ (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్‌) ధాటిగా ఆడాడు. థంపీ రెండు వికెట్లు తీశాడు.

ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 186/9 స్కోరుకే పరిమితమైంది. బ్రేవిస్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 49), తిలక్‌వర్మ (20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36) ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించగా.. సూర్యకుమార్‌ (30 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 43) ఫామ్‌ చాటాడు. ఓడియన్‌ స్మిత్‌ 4, రబాడ 2 వికెట్లు తీశారు. మయాంక్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఐపీఎల్‌ సీజన్‌లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఓడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement