Mumbai: మీ కూతురుపై అత్యాచారం చేస్తామంటూ ప్రముఖ క్రికెటర్‌కు బెదిరింపులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు, హైదరాబాద్‌కు చెందిన రామ్‌నగేష్‌ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడని గుర్తించిన సైబర్‌ క్రైమ్‌

ప్రముఖ భారత క్రికెటర్ పై బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం.. టీమిండియా ప్లేయర్ ని టార్గెట్‌ చేస్తూ.. ఆయన కూతురుపై అత్యాచారం పేరుతో సోషల్‌ మీడియాలో కొందరు దుండగులు అసభ్యకర పోస్టులు చేశారు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

ప్రముఖ భారత క్రికెటర్ పై బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం.. టీమిండియా ప్లేయర్ ని టార్గెట్‌ చేస్తూ.. ఆయన కూతురుపై అత్యాచారం పేరుతో సోషల్‌ మీడియాలో కొందరు దుండగులు అసభ్యకర పోస్టులు చేశారు.

తాజాగా క్రికెటర్ కూతుర్ని అత్యాచారం పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ వారిలో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల రామ్‌నగేష్‌ ఉన్నట్లు సైబర్‌ క్రైమ్‌ గుర్తించింది. ఈ మేరకు బుధవారం ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా పాక్‌తో మ్యాచ్‌ ఓడిన తర్వాత నగేష్‌ సోషల్‌ మీడియాలో క్రికెటర్ కూతురు గురించి అసభ్యకర మెసేజ్‌లు పెట్టినట్లు తేలింది. కాగా నగేష్‌ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement