Techie Dies Of Heart Attack: షాకింగ్ వీడియో, క్రికెట్ ఆడుతూ పిచ్ మధ్యలోనే గుండెపోటుతో కుప్పకూలిన బ్యాట్స్‌మెన్, ఆస్పత్రికి తరలించేలోపే మృతి

క్రికెట్‌ ఆడుతూ (Playing Cricket) ఓ టెకీ (Noida Techie) గుండెపోటుతో మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వికాస్‌ (34) అనే వ్యక్తి తోటివారితో కలిసి క్రికెట్‌ ఆడుతున్నాడు

Noida Techie Collapses On Pitch, Dies Of Heart Attack While Playing Cricket

Noida Techie Collapses On Pitch, Dies Of Heart Attack: క్రికెట్‌ ఆడుతూ (Playing Cricket) ఓ టెకీ (Noida Techie) గుండెపోటుతో మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వికాస్‌ (34) అనే వ్యక్తి తోటివారితో కలిసి క్రికెట్‌ ఆడుతున్నాడు. ఈ క్రమంలో రన్స్‌ తీస్తూ పిచ్‌ (Pitch) మధ్యలోకి రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మిగతా ఆటగాళ్లు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే వికాస్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా గుండెపోటుతో మరణించినట్లు వెల్లడైంది.పోలీసులు, మృతుడి స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్‌ గతంలో కొవిడ్‌ బారినపడి పూర్తిగా కోలుకున్నాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now