Rohit Sharma: అత్యధిక సిక్సర్లతో మార్టిన్‌ గప్తిల్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు కొట్టడానికి 4 సిక్సర్ల దూరంలో హిట్‌మ్యాన్‌

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు

Rohit Sharma

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ అయ్యేలోపు 5 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్‌ న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌ (256) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు.

అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్‌ దిగ్గజం​ క్రిస్‌ గేల్‌ (553) పేరిట ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్‌ కేవలం 4 సిక్సర్ల దూరంలో (550) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్‌ గప్తిల్‌ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్‌ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు.

Rohit Sharma (photo-BCCI)
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement