Suryakumar Yadav: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్, 18 సెంచరీలతో సరికొత్త రికార్డు

జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ప్రోటీస్‌ బౌలర్లకు సూర్య భాయ్‌ చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

Suryakumar Yadav (Photo-Twitter)

జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ప్రోటీస్‌ బౌలర్లకు సూర్య భాయ్‌ చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉండేది. రోహిత్‌ 79 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు.కాగా సూర్యకు ఇది నాలుగో టీ20 సెంచరీ కావడం విశేషం. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు (18)చేసిన రోహిత్ శర్మ(4), గ్లేన్ మ్యాక్స్‌వెల్‌(4) సరసన సూర్య నిలిచాడు.మ్యాక్స్‌వెల్ తన నాలుగు సెంచరీల మార్క్‌ను 92 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు.అదే విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై టీ20ల్లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌ కూడా సూర్యనే కావడం గమనార్హం

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement