Ishan Kishan Mimics Video: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ వాకింగ్ స్టయిల్‌ను అనుకరించి అందరినీ నవ్వించిన ఇషాన్ కిషన్, కోహ్లీ రియాక్షన్ ఏంటంటే..

ఇషాన్ కిషన్ మొన్న వైరల్ అయిన కోహ్లీ బాడీ లాంగ్వేజీని ఫాలో అవుతూ మిమిక్స్ చేశాడు. అది చూసిన ఇతర క్రికెటర్లు పడీ పడీ నవ్వారు. అయితే కోహ్లీ మాత్రం "నా నడక అలా ఉండదు" అంటూ ఇషాన్ కిషన్ కు చెప్పగా, ఆ కుర్ర క్రికెటర్ మరోసారి కోహ్లీలా నడిచి వినోదం పంచాడు

Virat Kohli's Priceless Reaction After Ishan Kishan Mimics His Walk, Video Goes Viral

నిన్న కొలంబోలో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వాకింగ్ స్టయిల్ ను యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అనుకరించడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఇషాన్ కిషన్ మొన్న వైరల్ అయిన కోహ్లీ బాడీ లాంగ్వేజీని ఫాలో అవుతూ మిమిక్స్ చేశాడు. అది చూసిన ఇతర క్రికెటర్లు పడీ పడీ నవ్వారు. అయితే కోహ్లీ మాత్రం "నా నడక అలా ఉండదు" అంటూ ఇషాన్ కిషన్ కు చెప్పగా, ఇషాన్ మరోసారి కోహ్లీలా నడిచి వినోదం పంచాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఆదివారం నాడు కొలంబోలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించడం తెలిసిందే. తొలుత సిరాజ్ 6 వికెట్లు తీసి లంక వెన్నువిరవగా, ఆ ఆతిథ్య జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకు కుప్పకూలింది. అనంతరం 51 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 6.1 ఓవర్లలోనే ఛేదించి 8వ సారి ఆసియా కప్ ను ఒడిసిపట్టింది.

Virat Kohli's Priceless Reaction After Ishan Kishan Mimics His Walk, Video Goes Viral

Here's Viral Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement