Chahal Magic Ball Video: చాహల్ మ్యాజిక్ బాల్ వీడియో ఇదిగో.. బిత్తరపోయిన తెల్లమొహం వేసిన బెన్ స్టోక్స్..
Chahal Magic Ball Video: భారత లేగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తన అద్భుతమైన స్పిన్ విన్యాసాలతో దుమ్మురేపాడు. నార్తాంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్, డర్హమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో చాహల్ అద్భుత బౌలింగ్‌తో 4 వికెట్లు నేలకూల్చాడు. అలెక్స్ లీస్, బెన్ స్టోక్స్, కేసీ ఆల్డ్రిడ్జ్, మాథ్యూ పాట్స్ వంటి కీలక వికెట్లను ఖాతాలో వేసుకోవడంతో నార్తాంప్టన్‌షైర్‌కు 20 పరుగుల ముఖ్యమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ముఖ్యంగా స్టోక్స్‌ను అవుట్ చేసిన డెలివరీ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆఫ్ స్టంప్ వెలుపల పిచ్ అయిన బంతి అనూహ్యంగా షార్ప్ టర్న్ తీసుకుంటూ వచ్చి స్టోక్స్ రక్షణ శ్రేణిని ఛేదించి నేరుగా వికెట్లను ఎగరగొట్టింది. ఈ మాయాజాల బంతికి స్టోక్స్ సైతం బిత్తరపోగా, అభిమానులు చాహల్ స్పిన్ నైపుణ్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో చాహల్‌తో పాటు కుల్దీప్ యాదవ్, అఖీబ్ నబీ, రాహుల్ చాహర్ వంటి ఇతర భారత ఆటగాళ్లు కూడా వివిధ జట్ల తరఫున రాణిస్తున్నారు.
Chahal Magic Ball Video: