Yuvraj Singh: యువ‌రాజ్ సింగ్‌కు నోటీసులు జారీ చేసిన గోవా ప్రభుత్వం, మోర్జిమ్‌లో ఉన్న విల్లా రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండానే వాడుకుంటున్న‌ట్లు నోటీసులో వెల్లడి

భారత మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌కు గోవా ప‌ర్యాట‌క శాఖ నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్‌లో ఉన్న విల్లా రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండానే వాడుకుంటున్న‌ట్లు యువీపై ఫిర్యాదు న‌మోదు అయ్యింది. ఈ కేసులో డిసెంబ‌ర్ 8వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ టూరిజం శాఖ ఆదేశించింది

Yuvraj Singh (Photo credit: PTI)

భారత మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌కు గోవా ప‌ర్యాట‌క శాఖ నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్‌లో ఉన్న విల్లా రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండానే వాడుకుంటున్న‌ట్లు యువీపై ఫిర్యాదు న‌మోదు అయ్యింది. ఈ కేసులో డిసెంబ‌ర్ 8వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ టూరిజం శాఖ ఆదేశించింది. హోమ్‌స్టేగా వాడుతున్న విల్లాకు గోవా ప‌ర్యాట‌క శాఖ నుంచి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. కాసా సింగ్ అని ఆ విల్లాకు యువీ పేరు పెట్టుకున్నాడు.ప్రాప‌ర్టీని రిజిస్ట‌ర్ చేసుకోలేదు కాబట్టి, ల‌క్ష‌రూపాయ‌లు జ‌రిమానా క‌ట్టాల‌ని ఆ నోటీసులో పేర్కొన్నారు.నార్త్ గోవాలో ఉన్న ఆ విల్లాకు న‌వంబ‌ర్ 18వ తేదీన నోటీసులు ఇచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement