R Praggnanandhaa: ప్రపంచ నంబర్ వన్‌కు షాకిచ్చిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానానంద, ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో ఘన విజయం
ఆన్‌లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ R ప్రజ్ఞానానంద ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాకిచ్చాడు. కార్ల్‌సెన్ యొక్క మూడు వరుస విజయాల రికార్డును ఆపేశాడు. ప్రగ్నానంద 39 ఎత్తుగడలతో నల్ల పావులతో గెలిచాడు.
ఆన్‌లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ R ప్రజ్ఞానానంద ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాకిచ్చాడు. కార్ల్‌సెన్ యొక్క మూడు వరుస విజయాల రికార్డును ఆపేశాడు. ప్రగ్నానంద 39 ఎత్తుగడలతో నల్ల పావులతో గెలిచాడు. టార్రాష్ వేరియేషన్ గేమ్‌లో అద్భుత ప్రదర్శన కనిబరిచిన ప్రజ్ఞానానంద ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు ఓటమి రుచి చూపించాడు.
భారత GM ఎనిమిది రౌండ్ల తర్వాత ఎనిమిది పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు. కొన్ని నెలల క్రితం ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో నార్వే ప్రపంచ నంబర్ 1 కార్ల్‌సెన్ చేతిలో ఓడిపోయిన రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నియాచి 19 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, డింగ్ లిరెన్ మరియు హాన్సెన్ (ఇద్దరూ 15 పాయింట్లతో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్, 16-ఆటగాళ్ల ఆన్‌లైన్ ర్యాపిడ్ టోర్నమెంట్‌లో, ఒక ఆటగాడు ప్రాథమిక రౌండ్‌లలో ఒక విజయానికి మూడు పాయింట్లు, డ్రా కోసం ఒక పాయింట్‌ను పొందుతాడు. ఇంకా ఏడు రౌండ్లు ప్రాథమిక దశలోనే మిగిలి ఉన్నాయి.